వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక ఆటతీరు తన స్థాయికి తగ్గట్టుగా లేదు. ముఖ్యంగా భారత్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంక జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడున్న క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని నియమిస్తున్నట్లు ఓ ప్రకటనను మంత్రిత్వశాఖ కార్యాలయం విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa