ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు సీ-విజిల్ యాప్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు, డబ్బులు ఆశ చూపడం, మద్యం సరఫరా చేయడం, నేరపూరిత చర్యలకు దిగడం, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం వంటి అంశాలపై ఫొటోలు, వీడియోలు తీసి ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలోని కమాండ్ కంట్రోల్ రూం సిబ్బంది ఈ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa