విజయవాడ నగరంలోని apsrtc బస్టాండ్ లో జరిగిన ప్రమాదంపై ఆర్టీసీ ఆర్ఎం ఏసుదానం స్పందిస్తూ..... బస్సు ఫ్లాట్ ఫాం మీదకి దూసుకొచ్చిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. గుంటూరు వెళ్లేందుకు బస్సులోకి ప్రయాణికులను ఎక్కించారని.. బస్సు బయలుదేరేందుకు డ్రైవర్ రివర్స్ గేర్ వేశారని తెలిపారు. గేర్ సరిగా పడకపోవడంతో బస్సు ఫ్లాట్ ఫాం పైకి దూసుకొచ్చిందన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. శాఖాపరమైన దర్యాప్తు చేశాక చర్యలు తీసుకుంటామని ఏసుదానం వెల్లడించారు.