ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ వైఖరివాలనే బస్సు ప్రమాదం జరిగింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 06, 2023, 01:22 PM

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడం బాధాకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్లాట్ ఫాం పైకి బస్సు దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉందని తెలిపారు. కాలంచెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదన్నారు. నాలుగున్నరేళ్లుగా ఆర్టీసీ గ్యారేజిల్లో నట్లు, బోల్టుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులివ్వడంలేదని అన్నారు. రిక్రూట్‌మెంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది తీవ్ర వత్తిడికి గురవుతున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు మెరుగైన పరిహారం అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నానని లోకేష్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com