కుప్పం రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు ని సోమవారం కుప్పం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని దళితుల సమస్యలపై, దళితులకు చెందిన ప్రభుత్వ భూముల ఆక్రమణలను ప్రస్తావించి, కొన్ని సమస్యలను ఫిర్యాదు చేశారు. ఆర్డీవో స్పందిస్తూ ఎటువంటి సమస్యలు అయినా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు.