అనంతపురం ప్రజలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. ఉమ్మడి జిల్లాలో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే పెద్దిరెడ్డి హంద్రీనీవా నీటిని అక్రమంగా పుంగనూరుకు తరలిస్తున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి నీటిని తరలిస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.