ఏటీఎం కార్డు (డెబిట్ కార్డు) ద్వారా ఉచిత బీమా పొందే అవకాశం ఉంది. డెబిట్ కార్డు ఉన్న వారంతా ఉచిత బీమాని పొందొచ్చు. డెబిట్ కార్డు ఉన్న వారికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బీమా కల్పిస్తున్నారు. SBI గోల్డ్ మాస్టర్/వీసా కార్డ్ ఉన్నట్టయితే రూ.2 లక్షల బీమా లభిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన తేదీ నుంచి గత 90 రోజులలో ఒక సారి కార్డును వాడితేనే ఈ బీమా వర్తిస్తుంది.