బంగ్లాదేశ్ సరిహద్దు వెంట నేరాలను అదుపుచేయడానికి సరిహద్దు భద్రతా దళం వినూత్న చర్యలకు సిద్దమైంది.కంచెపై తేనెటీగల పెంపకం పెట్టెలను ఏర్పాటు చేసింది.దీనివల్ల స్మగ్లింగ్, ఇతర నేరాలకు కళ్లెం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. స్థానిక ప్రజలకు జీవనోపాధి ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లోని నదియా జిల్లా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆయుష్ మంత్రిత్వశాఖ కూడా తోడ్పాటు అందిస్తోంది.