సనాతన ధర్మంపై సెప్టెంబరులో తాను చేసిన వ్యాఖ్యలలో తప్పు లేదని తమిళనాడు యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం అన్నారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు.. న్యాయపరంగా ఎదుర్కొంటాం.. నా స్టాండ్‌ను మార్చుకోను.. నా భావజాలం గురించి మాత్రమే మాట్లాడాను అని ఉదయనిధి అన్నారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని.. దాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలపై దేశ రాజకీయాల్లో పెను వివాదమే చెలరేగింది.