కడపజిల్లా రాజుపాలెంలోని శాఖా గ్రంధాలయంలో ఈ నెల 14 నుండి 20 వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు సోమవారం గ్రంథాలయాధికారి ప్రతాపుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనంతో పాటు వివిధ పోటీలను నిర్వహించి వారోత్సవాల ముగింపు రోజు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa