మూడేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మథురలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల బాలికను 15 ఏళ్ల బాలుడు స్వీట్ ఇచ్చి వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేశాడు. ఇంట్లో బాలిక కనిపించకపోవడంతో స్థానికంగా ఆరా తీశారు. ఓ బాలుడు తన ఇంటికి తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడికి వెళ్లి చూడగా.. బాలిక స్పృహ కోల్పోయి పడి ఉంది. బాలికను ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేశారు.