రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ రైతులకు వెంటనే కౌలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ మెండెం కోటేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం దళితులు నా మేనమామలు అని చెప్పిన జగన్. నేడు దళితులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లో పలుచోట్ల దళితులకు కేటాయించాల్సిన ప్లాట్లు కేటాయించకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు.