ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నను మళ్లీ సీఎంగా చేసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2023, 12:33 PM

వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి పినిపె విశ్వరూప్ మాట్లాడుతూ.... బాబు హయాంలో పేపర్లకే పరిమితమైన సామాజిక సాధికారత.. జగనన్న పాలనలో చేతల్లో చూపారు. రాజ్యాధికారంలో ఎవరి వాటా వారికిచ్చి సామాజిక న్యాయం చేశారు. బాబు పాలనలో ఎస్టీలకు, మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు.  ఎస్సీలు, బీసీలకు, ముస్లింలకు, కాపులకు, ఎస్టీలకు ఉపముఖ్యమంత్రి పదవులిచ్చిన సీఎం జగన్‌. సామాజిక సాధికారతకు ఛాంపియన్‌ ఆఫ్‌ ఛాంపియన్‌ జగనన్న. బాబు హయాంలో 30 లక్షల మందికి పింఛన్లు ఇస్తే, నేడు 64 లక్షల మందికి జగనన్న ఇస్తున్నారు. కేవలం ఎన్నికల కోసమే 650 వాగ్దానాలు ఇచ్చిన తుంగలో తొక్కిన చంద్రబాబు. 2024లో జగనన్న తిరిగి సీఎం కాకపోతే చదువుల యజ్ఞం మధ్యలో ఆగిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చదువులు, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నను మళ్లీ సీఎంగా చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com