పాము విషం కేసుకు సంబంధించి బిగ్ బాస్ విజేత మరియు యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌కు నోయిడా పోలీసులు మంగళవారం నోటీసు పంపారు. ఎల్విష్‌ను ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న తర్వాత ఇది జరిగింది. నోయిడాలోని ఓ రేవ్ పార్టీలో పాము విషాన్ని సరఫరా చేశారన్న ఆరోపణలపై నోయిడా సెక్టార్ 49 పోలీస్ స్టేషన్‌లో ఎల్విష్ యాదవ్‌తో సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్ లక్ష్మీ సింగ్ ఆదేశాల మేరకు నోయిడాలోని సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ నుండి సెక్టార్ 20 పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ పర్యావరణ శాఖ మంత్రి అరుణ్ సక్సేనా మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టం కంటే సెలబ్రిటీ ఎవరూ పెద్దవారు కాదని అన్నారు.హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం మాట్లాడుతూ కేసు విచారణపై తన ప్రభావం లేదని, ఎల్విష్ దోషిగా తేలితే పోలీసులు చర్యలు తీసుకుంటారని ఉద్ఘాటించారు.