ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడంలో భాగంగా ఆ నీరు ఎలా శుద్ధి చేస్తారో మహిళలు అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ వి. మల్లికార్జున, చైర్ పర్సన్ భవాని సూచించారు. మంగళవారం గుంతకల్లు పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద జల్ దీవాళి(నీళ్ళ కోసం మహిళలు, మహిళల కోసం నీళ్ళు)కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందించే నీరు శుద్ధి చేసే ప్రక్రియను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు.