ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్‌పై విచారణ జరిగింది. విచారణ చేపట్టిన జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రావణ్‌కుమార్ ధర్మాసనం.. పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై కోర్టు విచారణ చేపట్టింది. పిల్లో సవరణలను పరిగణనలోకి తీసుకుని జగన్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది.