రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్ ను బుధవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకరిస్తూ, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేపడుతూ విద్యాసంస్థల బందుకు నేడు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు విద్యార్థి సంగం నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘం నాయకులు అసహనం వ్యక్తం చేశారు.