హిందూపురం పట్టణంలోని రైల్వే రోడ్ లో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను హిందూపురం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, వైయస్ఆర్ సీపీ నాయకులు గుడ్డంపల్లి వేణు రెడ్డి బుధవారం పరిశీలించారు. రైల్వే రోడ్డు విస్తరణలో భాగంగా బిల్డింగ్స్ డెమోలిసింగ్, మురికి కాలువలు, కరెంట్ పోల్స్, తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆసిఫ్ మున్సిపల్ అధికారులు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.