బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఉద్యోగులకు దీపావళి సందర్భంగా రూ. 26,000 బోనస్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బుధవారం ప్రకటించారు. బీఎంసీ ఉద్యోగుల సంఘాలతో సమావేశం అనంతరం షిండే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.అంతకుముందు రోజు, శివసేన (యుబిటి) నాయకుడు ఆదిత్య థాకరే బోనస్ ప్రకటించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు.