గతంలో అబద్ధం అధికారంలో ఉంది.. ఆ అబద్ధమే చంద్రబాబు అంటూ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాల్ దుయ్యబట్టారు. అయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో నాలుగు మాయమాటలు చెప్పి అధికారం పొందాలని గత పాలకులు అనుకుంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. 139 బీసీ కులాలను గుర్తించి వారి సామాజిక స్థితి పెరగడానికి అండగా నిలిచారు. బీసీ వర్గాలను అణచివేసిన వ్యక్తి చంద్రబాబు. పేదరికంపై యుద్ధం చేయాలంటే ఆయుధం విద్య అని అంబేద్కర్ చెప్పారు. ఆయనకు నిజమైన వారసుడిగా విద్యకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు అని మంత్రి వేణు పేర్కొన్నారు.