నీటి పొదుపులో మహిళలే ఎంతో కీలకమని నగర ప్రజలు నీటి వనరులను దుర్వినియోగం చేయకుండా పొదుపుగా వాడుకోవాలని గురువారం అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నీటివృధాను అరికట్టి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో స్వయం సహాయక గ్రూపుల నుంచి ఎంపిక చేసిన 50 మంది అమృత్ మిత్రలకు నగరానికి మంచినీటిని అందించే ముద్దలాపురం స్టోరేజ్ ట్యాంక్ వద్ద నీటి దీపావళి పేరిట అవగాహన కల్పించారు.