జగనన్న పాలవెల్లువ విషయంలో ఈ నెల 2న పత్రికా సమావేశంలో చెప్పిన మాటకు నూటికి నూరుశాతం జనసేన కట్టుబడి ఉందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగనన్న పాలవెల్లువ పథకంలో రూ.2887కోట్ల అవినీతి జరిగిన మాట ముమ్మాటికీ వాస్తవమని, ఈ స్కామ్‌పై శాఖాపరమైన విచారణతో పాటు సీబీఐతో కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నవంబరు 14తర్వాత రోజుకో స్కామ్‌పై లెక్కలతో సహా మీడియా ఎదుట బయటపెడతామని మనోహర్ చెప్పారు.