ఆధార్ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్ కార్డులను కేంద్రం డీయాక్టివేట్ చేసింది. ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా.. అందులో 13 కోట్ల కార్డులు ఆధార్‌తో లింక్ కాలేదు. 2017 జులై 1 తర్వాత జారీ చేసిన పాన్ కార్డులు మాత్రమే ఆటోమెటిక్‌గా ఆధార్‌తో లింక్ అవుతాయి. డీయాక్టివేట్ చేసిన కార్డులను యాక్టివేట్ చేసుకోవడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు రూ.1000 జరిమానా విధించింది.