బీహార్లోని మోతిహారిలో ఓ ఇంట్లో సిలిండర్ పేలి ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు చెలరేగడంతో చిన్నారులు సహా 25 మంది గాయపడ్డారు. వంట చేస్తుండగా సిలిండర్ గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మందికి పైగా మంటల్లో చిక్కుకోగా, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం బెట్టియా జిఎంసిహెచ్కి, విర్గంజ్ ఆసుపత్రులలో చేర్పించారు.