ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ్టితో ముగియనున్న పదో తరగతి పరీక్షల ఫీజు గడువును అధికారులు పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండానే ఈ నెల 20 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రూ.50 ఫైన్ ఈ నెల 25 వరకు, రూ.200 ఫైన్ తో ఈ నెల 30 వరకు, రూ.500 ఫైన్ డిసెంబర్ 5లోపు చెల్లించవచ్చని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa