పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని మారణకాండాన్ని ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి. అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా రాజమండ్రిలో సిపిఎం - సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదం నశించాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, యుదోన్మాద్ధం నశించాలని పేర్కొన్నారు.