సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 15న మాచర్లలోని వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. బుధవారం ఉదయం 9. 45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు.నేరుగా మాచర్లకు చేరుకుంటారు. అక్కడ చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశం సభాస్థలి వద్దనే వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించి. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.