గత కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయిన చెట్లు నరికే విష సంస్కృతికి ముగింపు పలుకుదామని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ సోమవారం పిలుపునిచ్చారు. దీనిపై రాజకీయ నాయకుల్లో అలాగే సామాన్య ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ఆయన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాడిమర్రి మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేసేందుకు శ్రీరామ్ సంకల్పించారు.