రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేనదే విజయమని తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వరుపుల సత్యప్రభ రాజా చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సీఎం జగన్ అధ్వాన్న పాలనకు ప్రజలు విసుగుచెంది టీడీపీ, జనసేన కూటమికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ నెల 15న ప్రత్తిపాడులో టీడీపీ, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నామని, విజయవంతమయ్యేందుకు కృషి చేయాలన్నారు. అలానే పారుపాకలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నేతలు కోసూరి కృష్ణవర్మ, తిరుమల దొర, మాజీ ఎంపీపీ ఇటంశేట్టి సూర్య భాస్క రరావు, మాజీ సర్పంచ్ పైలసాంబశివరావు, పసగడుగుల రమణ తదితరులు పాల్గొన్నారు.