జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. గురువారం ఉదయం దోడా జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించిింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోనూ స్వల్పంగా భూమి కంపించింది.