గుంటూరు జిల్లా, మంగళగిరి పరిధి పెదవడ్లపూడి కి చెందిన వేగి గీతకు కాకినాడ కు చెందిన మణికంఠతో 8ఏళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసగా మారిన మణికంఠ తరచూ భార్యని కొట్టి చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో భర్త పెట్టే చిత్ర హింసలు తట్టుకోలేని గీత ఇటీవల పెదవడ్లపూడి లోని తన పుట్టింటికి వచ్చింది. బుధవారం మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.