విశాఖపట్నం: యలమంచిలి- నర్సింగబిల్లి రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు (65) మృతి చెందాడని తుని రైల్వే పోలీసు స్టేషన్ ఎస్సై అబ్దుల్ మారూఫ్ తెలిపారు. తెలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నాడని, మృతదేహనికి కొంత దూరంలో చేతికర్ర పడి ఉందని చెప్పారు. అవి తప్ప ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతదేహన్ని భద్రపరచామని ఆచూకీ తెలిసినవారు సంప్రదించాలన్నారు.