మాజీ మంత్రి, శివసేన నేత ఆదిత్య థాక్రేపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని లోయర్ పరేల్లో డెలిస్లే బ్రిడ్జి రెండో క్యారేజీని ఆదిత్య థాక్రే ప్రారంభించారు. అయితే అనుమతి లేకుండా బ్రిడ్జిని ప్రారంభించారని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆయనపై ఫిర్యాదు చేసింది. ఆదిత్య థాక్రేతోపాటు సచిన్ అహిర్, సునీల్ షిండేపై ఎఫ్ఐఆర్ నమోదైంది.