ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోంది. పెద్దఎత్తున కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టబోతోంది. ప్రధానంగా పట్టణాలతో వాటి సమీపంలోని గ్రామాలను కలిపే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. 20 రోజుల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండే 202 రోడ్లను రూ. 784.22 కోట్లతో పూర్తిస్థాయిలో మరమ్మతులతోపాటు పునర్నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ఆదేశించిన విషయం విధితమే.