‘సీఎంజగన్ ప్రతి ప్రసంగంలోనూ నా ఎస్సీలు..నా బీసీలు..నా మైనార్టీలు అంటారు.. ఆయన దృష్టిలో ‘నా’ అంటే నాశనం.. ఆయా వర్గాలను నాశనం చేయడమే జగన్ లక్ష్యం’ అని మాజీ MLC బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో రాష్ట్ర బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.