ఏపీలోని అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. చదవడం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని (17).. తనకు చదవడం ఇష్టం లేదని కొన్ని రోజులుగా ఇంట్లో చెబుతుండేది. తల్లిదండ్రులు మాత్రం సర్దిచెప్పి కాలేజీకి పంపేవాళ్లు. ఇష్టం లేకున్నా కాలేజీకి వెళ్లిన శాంతి.. తీవ్ర మనస్తాపానికి గురై శనివారం ఉరివేసుకుంది.