దేశంలో ఫార్మా విద్య నియంత్రణ కోసం కొత్త జాతీయ ఫార్మసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల అభిప్రాయాల కోసం ముసాయిదా బిల్లును విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న ఫార్మసీ చట్టం-1948 చేసి, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది. ఫార్మసీ విద్య ప్రమాణాలను పెంచడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.