వేమూరు నియోజకవర్గం కొల్లూరు శాఖా గ్రంథాలయం నందు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ యు. రామయ్య , హోంగార్డ్ మహేష్ ఇందిరా గాంధీ చిత్రపటానికి ఆదివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది. రామయ్య మాట్లాడుతూ దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు కొనియాడుతూ అనేక రంగాల్లో భారతదేశాన్ని ముందుకు తీసుకుని వెళ్లారని, ప్రథమ మహిళా ప్రధాని అని అన్నారు.