మయన్మార్ సైన్యం, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ కాల్పులు జరుపుతుండటంతో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు మయన్మార్ సైనికులు భారత్ కు వస్తున్నారు. ఈ నెల 16న చిన్ రాష్ట్రంలోని ఆర్మీ క్యాంపుపై పీడీఎఫ్ మద్దతుగల ఉగ్రవాదులు దాడి చేయడంతో 29 మంది మయన్మార్ సైనికులు మిజోరంలోని ఛాంఫై జిల్లాకు చేరుకున్నారు. వారిని గుర్తించి తమ దేశానికి పంపించామని మిజోరాం ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa