జగన్ సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. .ఒంగోలులో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారన్నారని ఆరోపించారు. సామాజిక బస్సు యాత్ర నిర్వహించే అర్హత వైసీపీకి లేదని పురంధేశ్వరి అన్నారు.