ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రభుత్వం వినాశకర పాలన అందిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2023, 01:42 PM

దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర, వినాశకర పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దేవుడి విగ్రహాల నుంచి, గర్భ గుడిలో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారన్నారు. మోదీ అన్నీ కులాలకు న్యాయం చేయాలని పాలన చేస్తుంటే సీఎం జగన్ సామాజిక, సాధికార యాత్రల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక, సాధికార యాత్రలు చేసే నైతిక హక్కు వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. ఎస్సీ, బీసీలకు న్యాయం చేసే పరిస్థితి లేదని ఆమె తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com