కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం మాధవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జెండాను తొలగించిన ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి మరికాసేపట్లో టీడీపీ జెండాను తొలగించిన చోటే జెండా ఆవిష్కరణకు వెళ్లనున్నారు. టీడీపీ జెండా దిమ్మెకు కొద్ది దూరంలో వైసీపీ జెండా దిమ్మె ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.