ఏపీలో సీపీఐ ఆధ్వర్యంలో ఇవాళ 30 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. కృష్ణ జలాల పునఃపంపిణీ, కరవు తీవ్రతపై నిరసన దీక్ష చేపట్టామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'రాష్ట్ర వ్యాప్తంగా కరవు పరిస్థితి తీవ్రంగా ఉంది. కరవు విషయంలో సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రంలో కరవు తీవ్రతను ప్రభుత్వం తగ్గించి చెబుతోంది' అని ఆరోపించారు.