ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ మంజూరైన చెక్కులను కుటుంబ అవసరాల నిమిత్తం వాడుకోవాలన్నారు. జగనన్న ప్రతి నిరుపేదను ఆదుకోవడానికే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.