మంగళగిరి నగరంలోని శ్రీగంగా భ్రమరాంబసమేత మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం (శివాలయం) లో జరుగుతున్న అభివృద్ధి పనులకు భక్తులు ఎవరైనా విరాళాలు ఇవ్వదలచిన భక్తులు విరాళాలకు తగ్గ రశీదును తప్పనిసరిగా తీసుకోవాలని ఆలయ ఈవో అన్నపరెడ్డి రామకోటిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శివాలయం విరాళాల వసూలులో ఇటీవల వస్తున్న పలు ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.