రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని ఎల్ 1జి. జ్యోతి అన్నారు. మంగళవారం చెరుకుపల్లి మండలం నడింపల్లి యూనిట్ పరిధిలోని రాజోలు గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశపర్ని కాషాయం తయారీకి ఆవు మూత్రం ఆవు పేడ పది రకాల ఆకులు పచ్చిమిర్చి వెల్లుల్లి, ఇంగువ, పొగాకు కలిపి ఉంచితే 40 రోజుల్లో ఎరువు తయారవుతుందన్నారు. వరి పైరు దిగుబడి పెరుగుతుందన్నారు.