కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ భీకర పోరులో కీలక పరిణామం చోటుచేసుకుంది.50 మంది బందీల విడుదలకు హమాస్‌తో ఇజ్రాయెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా గాజాలో నాలుగు రోజులు కాల్పుల విరమణ అమలు చేయనున్నారు. కాల్పుల విరమణతో గాజాకు మరింత మానవతా సాయం అందించేందుకు వీలు లభిస్తుందని ఖతార్ తెలిపింది.