సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ) దిశగా ఆస్ట్రేలియాతో చర్చలు పురోగతిలో ఉన్నాయని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తెలిపారు. ఇరు దేశాలు ఆర్థిక, భద్రత వ్యవహారాల్లో మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయని చెప్పారు. క్వాడ్ సభ్యులుగా, ప్రజాస్వామ్య దేశాలుగా భారత్, ఆస్ట్రేలియాలు… ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులతో పాటు సుస్థిరత, భద్రత ఉండాలని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు.