రేపు అనగా శుక్రవారం తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీవారు వెలసిన శేషగిరులపై దక్షిణభాగంలో చక్రతీర్థం ఉంది. చక్రతీర్థ ముక్కోటి రోజున ఉదయం 9 గంటలకు అర్చకులు, పరిచారకులు మంగళవాయిద్యాలతో ఆలయం నుంచి ప్రదక్షిణగా చక్రతీర్థానికి వెళతారు. అక్కడ వెలసిన చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామికి, ఆంజనేయస్వామికి అభిషేకం, పుష్పాలంకరణ, పూజలు చేస్తారు. అనంతరం హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa