వైసీపీ పాలనలో ఏ గ్రామంలో చూసిన అభివృద్ధి కనుమరుగైందని కళ్యాణదుర్గం టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు విమర్శించారు. శుక్రవారం కంబదూరు మండలం రాళ్ళ అనంతపురంలో బాబు ష్యురిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. ఆయన మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్ల పాలనలో దోపిడీ అక్రమాలు అవినీతి దౌర్జన్యాలు కనిపిస్తున్నాయి తప్ప అభివృద్ధి పూర్తిగా శూన్యంగా మారిందన్నారు.